ఆ గ్రామానికి పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు..

ఆ గ్రామానికి  పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు..

NLG: అనుముల మండలం పేరూరు గ్రామానికి గత 25 రోజులుగా వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పేరూరులోని సోమ సముద్రం చెరువుకు భారీగా వరద నీరు రావడంతో కత్వపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో హాలియా- పేరూరు గ్రామాల మధ్య ఉన్న లోలెవల్ బ్రిడ్జి కొట్టుకుపోడంతో గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాని గ్రామస్థులు తెలిపారు.