భోగ నంజుండేశ్వర స్వామికి మాఘ మాస పూజలు

భోగ నంజుండేశ్వర స్వామికి మాఘ మాస పూజలు

CTR: పుంగనూరు పట్టణం 30వ వార్డులోని శ్రీ భోగ నంజుండేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం మాఘమాస పూజలు జరిగాయి. అర్చకులు లింగాకి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు అనంతరం ఫల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.