చెల్లని చెక్కులు ఇచ్చిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

ప్రకాశం: గిద్దలూరు గణేష్ నగర్‌కు చెందిన శివకుమార్ వద్ద వెంకట రమేష్ బాబు అనే వ్యక్తి 2021లో రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు చెల్లించే క్రమంలో రమేష్ బాబు వెంకట శివకుమార్‌కు చెల్లని 2 చెక్కులు ఇచ్చాడు. బాధితుడు కోర్టును ఆశ్రయించగా గిద్దలూరు కోర్టు విచారణ జరిపి రమేష్ బాబుకు బుధవారం ఏడాది జైలు శిక్ష తీసుకున్న నగదు మొత్తం తిరిగి చెల్లించాలని ఆదేశించింది.