పులి సంచారం.. గ్రామాల్లో భయం

పులి సంచారం.. గ్రామాల్లో భయం

KKD: పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం గిరిజన ప్రాంత ప్రజలను భయపెడుతున్న విషయం తెలిసిందే. అటవీశాఖ అధికారులు పులి కదలికలు గమనిస్తూ సమీప గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అర్ధరాత్రి పులి ఏలేశ్వరం(M) పరిమితడక గ్రామ సమీపంలో ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ప్రాంతం కాకినాడ, పోలవరం జిల్లాల బోర్డర్ కావడంతో రెండు జిల్లాల అధికారులు పులిపై నిఘా ఉంచారు.