సంతకాల సేకరణకు మద్దతు పలికిన మంత్రి రవీంద్ర

CTR: చిత్తూరులో ‘అపోలో హాస్పిటల్ వద్దు- ప్రభుత్వాసుపత్రి ముద్దు' అనే నినాదంపై సంతకాల సేకరణ కార్యక్రమం చిత్తూరు టౌన్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ షణ్ముగం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆదివారం మంత్రి రవీంద్ర, ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ మద్దతుగా సంతకాలు చేశారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు షణ్ముగం తెలిపారు.