ఈ నెల 24 నుంచి 'రైతన్నా మీకోసం' కార్యక్రమం
KRNL: జిల్లాలో ఈ నెల 24 నుంచి 29 వరకు 'రైతన్నా మీకోసం' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు. నిన్న అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. ఇంటింటికీ వెళ్లి రైతులకు పంచ సూత్రాలు, నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు వంటి వివరాలను తెలియజేయాలని సూచించారు.