అధ్వానంగా నల్గొండ శివారు కాలనీలు
NLG: నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామాలు అభివృద్ధికి దూరంగా సమస్యలతో సతమతమవుతున్నాయి. గంధంవారిగూడెం, చర్లపల్లి, ఆర్జలబావి, కేశరాజుపల్లి వంటి శివారు గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా మారాయి. ముఖ్యంగా డ్రైనేజీ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. మురుగు కాలువలను పట్టించుకునే సిబ్బంది లేకపోవడంతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారని, అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.