VIDEO: అన్నారంలో యాకుబ్ షావలి బాబా ఉర్సు ప్రారంభం..
WGL: పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్‌లో హజ్రత్ సయ్యద్ యాకుబ్ షావలి బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు సోమవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. దర్గాలను విద్యుత్ దీపాలతో అలంకరించి, గంధం ఊరేగింపుతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఏసీపీ వెంకటేశ్, పర్వతగిరి సీఐ రాజగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.