రేపు ఉమ్మడి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం ఇంఛార్జి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కరకగూడెం, పినపాక, మణుగూరు, ఆశ్వాపురం, బూర్గంపాడు, పాల్వంచ మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారని పేర్కొన్నారు.