నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్

నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్

PLD: చిలకలూరిపేటలో దానయ్య అనే ఆటో డ్రైవర్ తన నిజాయితీ చాటుకున్నాడు. శనివారం ఓ మహిళ తన పర్సును ఆటోలో మర్చిపోయింది. అందులో రూ.6,500 నగదు, ఏటీఎం కార్డులు ఉన్నాయి. వెంటనే ఆటో యూనియన్ సభ్యులు ఆ పర్సును అర్బన్ సీఐ రమేష్‌కి అందజేశారు. సీఐ ఆ మహిళను పిలిపించి, దానయ్య చేతుల మీదుగా పర్సును తిరిగి ఇప్పించారు. ఆటో డ్రైవర్ నిజాయితీని అందరూ మెచ్చుకున్నారు.