నాగాయలంకలో నీరు అందక రైతుల ఆవేదన

నాగాయలంకలో నీరు అందక రైతుల ఆవేదన

కృష్ణా: నాగాయలంక మండలంలోని తలకడ దీవి, బరంకుల, గనుపేశ్వరం, నాలి, దీనదాయలపురం పరిసర ప్రాంతాల్లో నారుమడులు నీరు లేక బీడుభూములగా మారుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఎగువ కాలువలకు రాత్రిపూట నీరు తరలిస్తున్నారని ఆరోపిస్తూ దిగువ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.