మంచు దుప్పటిలో అరకులోయ పరిసర ప్రాంతం

మంచు దుప్పటిలో అరకులోయ పరిసర ప్రాంతం

PPM: అల్లూరి జిల్లా మన్యం గ్రామీణ ప్రాంతాల్లో చలి విజృంభించింది. పర్యటక కేంద్రమైన అరకులోయ మండల పరిసర ప్రాంతంలో మంచు దట్టంగా కురుస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది. సోమవారం తెల్లవారుజామున నుంచి ఉదయం 9:30 గంటల వరకు కురిసిన దట్టమైన పొగమంచు కారణంగా ప్రజలు కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.