ఎందరో త్యాగాల ఫలితం మన స్వాతంత్య్రం..ఎంపీపీ

ASR: ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి మనకు స్వాతంత్య్రం తీసుకొచ్చారని కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేశ్ అన్నారు. వారి త్యాగాలను మనం మరచిపోకూడదని పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావుతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. స్వాతంత్య్ర పోరాటానికి తొలిమెట్టు త్యాగం అని పేర్కొన్నారు.