ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

MHBD: మహబూబాబాద్ లోని వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మున్నేరు వాగులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు వాగులు వంకల్లోకి వెళ్ళకూడదని, చేపల వేట, విద్యుత్ స్తంభాల దగ్గర అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.