వల్లూరులో కూలిపోయిన విద్యుత్ స్తంభం
KRNL: కౌతాళం మండలం వల్లూరు గ్రామంలో ఆకస్మికంగా విద్యుత్ స్తంభం నేల కూలింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివప్ప గౌడ్ వెంటనే కొత్త స్తంభం ఏర్పాటు చేయించి మరమ్మతులు చేయించారు. శిథిలావస్థకు చేరిన స్తంభాలపై దృష్టి పెట్టాలని అధికారులను గ్రామ ప్రజలు కోరారు.