బొబ్బిలిలో సమిత్వ సర్వేను పరిశీలించిన DDO

VZM: బొబ్బిలి DDO కిరణ్ కుమార్ గురువారం మండలంలోని కలువరాయులో సమిత్వ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలని సూచించారు. ఖాళీ స్థలాలు, ఇళ్లను గుర్తించేందుకు ప్రభుత్వం ఈ సమిత్వ సర్వే చేస్తుందన్నారు. సర్వే సమగ్రంగా నిర్వహించి, డేటా సేకరించాలని, సర్వేలో తప్పులు లేకుండా చూడాలన్నారు. అనంతరం పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.