అంకుషాపూర్: ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేసిన గ్రామస్థులు

మంచిర్యాల: భీమారం మండలం అంకుషాపూర్ గ్రామంలో 5 లక్షల MGNREGS నిధులతో సీసీ రోడ్డును నిర్మించారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తవడంతో శుక్రవారం స్ధానిక ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ నాయకులు చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలియజేశారు.