పెట్రోల్ బంక్ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

PLD: వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంకు నిర్మాణానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సోమవారం భూమిపూజ చేశారు. వెల్దుర్తి ప్రాంతంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం పట్ల రైతులు, వాహనదారులకు ఎంతగానో సహాయపడుతుందని అన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యేను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు.