వల్లభనేని వంశీ రిమాండ్ పొడగింపు

వల్లభనేని వంశీ రిమాండ్ పొడగింపు

కృష్ణా: సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో రిమాండ్‌లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి రిమాండ్‌ను ఈ నెల 22 వరకు పొడిగిస్తూ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సత్యవర్థన్ కిడ్నాప్ కేసుతో పాటు, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.