'రాష్ట్ర సంక్షేమం కోసం కృషి చేస్తున్న పవన్ కోలుకోవాలి'
E.G: డిప్యూటీ సీఎం, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ కోరుకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో అర్చనలు, అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.