'టీ' ఎంత సేపు మరగాలంటే?

రోజులో రెండు నుంచి నాలుగు కప్పుల 'టీ' తాగితే జీవితకాలం పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. టీ తాగడం వల్ల మతిమరుపు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని తేలింది. గ్రీన్, బ్లాక్ టీ వంటి వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్న ఫైటోకెమికల్స్ ఉంటాయని చెబుతున్నాయి. టీని మరిగించే సమయాన్నిబట్టి దానిలోని పోషకాలు లభిస్తాయని, రెండు నిమిషాలే మరిగించాలని పేర్కొన్నాయి.