VIDEO: 'మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి'
జగిత్యాల: జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటుచేయాలని కోరుతూ.. జిల్లా రైతుఐక్య వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో ప్రస్తుతం మొక్కజొన్న పంట చేతికి వచ్చిందని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు రమేష్ రెడ్డి అన్నారు.