'బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలి'
MNCL: బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలను అమలు చేయాలని శనివారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ ఒడ్డేపల్లి మనోహర్, నాయకులు నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.