గుండ్లపల్లి వద్ద నిలిచిపోయిన రాకపోకలు

KNR: గన్నేరువరం మండలంలో బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి గుండ్లపల్లి దేవుని చెరువు మత్తడి ప్రవాహం పెరిగి లో లెవెల్ కల్వర్టుపై నుంచి వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. దీంతో గుండ్లపల్లి నుంచి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామపంచాయతీ సిబ్బంది కల్వర్టుకు ఇరువైపులా కర్రలను ఏర్పాటు చేశారు.