కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

చిత్తూరు: పుంగనూరు మండలంలో మంగళవారం విషాదం నెలకొంది. రాంపల్లిలో ఇంటి గోడలకు నీళ్లు పడుతూ మనీ(32) ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే స్థానికులు ఆయన్ను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.