PU డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల
MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్లాగ్) ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. నవంబర్ 7 నుంచి 12వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ www.palamuruuniversity.com వెబ్ సైట్‌లో చూడాలన్నారు.