మత్స్యకారుల సమస్యకు పరిష్కారం
E.G: గోదావరి గట్టున కోటిలింగాలపేట, అలాగే ఆ సమీపంలో నివాసం ఉంటున్న మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించినట్లు MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఫిషరీస్‌తో పాటు ఆయా శాఖలను సమన్వయం చేసి 216 మత్స్యకార కుటుంబాలకు వరద నష్టపరిహారం అందేలా చేయడంలో సఫలీకృతులమయ్యామని వివరించారు.