ట్రైనీ ఐఏఎస్ అధికారులతో కలెక్టర్ ట్రెక్కింగ్
NTR: స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాకారానికి సమ్మిళిత, సుస్థిర ఆర్థిక వృద్ధి ముఖ్యమని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ ట్రైనీ ఐఏఎస్ అధికారులతో కలిసి కొండపల్లి ఖిల్లాలో ట్రెక్కింగ్ చేశారు. వారికి ఖిల్లా చారిత్రక వైభవాన్ని వివరించారు. కొండపల్లి కోటను కూడా పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు చొరవ తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.