డిప్యూటీ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరణ
ELR: ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవోగా టి.ముత్తయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన భీమడోలు మండలం సూరప్పగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి పనిచేసి పదోన్నతపై ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవోగా వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాజ్ మనోజ్‌ను ముత్తయ్య మర్యాదపూర్వకంగా కలుసుకుని జాయినింగ్ ఆర్డర్ కాపీ అందజేశారు.