భానుడి ప్రతాపం.. వెలవెల బోయిన రోడ్లు
CTR: భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం పుంగనూరులో ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలకు చేరాయి. మార్చి రెండో వారంలోనే ఇలా ఉంటే ఇక రానున్న రోజుల్లో పరిస్థితి దారుణంగా ఉంటుందేమో అని ప్రజలు అనుకుంటున్నారు. రోడ్లపై వేడిగాలులు వీస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే మినీ బైపాస్ రోడ్డు ఎండ ప్రభావానికి వెలవెలబోయింది. వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది.