'ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి'
SKLM: జి.సిగడాం మండలం సంత వురిటి పంచాయతీలో ఎమ్మెల్యే ఈశ్వరరావు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ హోమియో వైద్యశాలను సందర్శించి వైద్య సిబ్బందితో మాట్లాడారు. రోగులకు అందిస్తున్న చికిత్స, ఔషధాల అందుబాటు, సేవల స్థాయి వంటి అంశాలను తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.