ఆశా భోంస్లేకు వినూత్నంగా ఆర్టిస్ట్ నివాళి
SRD: చిత్ర పరిశ్రమకు ఎనలేని కృషిచేసి మధురమైన గానంతో ఆశాభోంస్లే పాడిన వేలాది పాటలు చిరస్మరణీయమని ఖేడ్‌కు చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ పేర్కొన్నారు. ఇవాళ ఆమె తుది శ్వాస విడిచిన సందర్భంగా రావి ఆకుపై ఆమె చిత్రాన్ని గీసి ఆవిష్కరించారు. ఈమేరకు పత్రంపై ఆమె చిత్రానికి నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.