నరసన్నపేటలో ఈ నెల 12న జాబ్ మేళా

నరసన్నపేటలో ఈ నెల 12న జాబ్ మేళా

SKLM: నరసన్నపేటలో ఈ నెల 12న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నరసన్నపేట పద్మావతి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా naipunyam.ap.gov.inవెబ్‌సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలిని సూచించారు.