ప్రత్యేక సాగుకు అరుదైన గౌరవం

NLG: మునుగోడు మండలం కోతులారానికి చెందిన జాజుల బుచ్చిరాములు, ఆయన భార్య సైదమ్మ శుక్రవారం ఢిల్లీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ దంపతులు కోతులారంలో వినూత్నంగా 7ఎకరాల్లో కలబంద సాగు చేస్తున్నారు. వీరి కృషికి గుర్తింపుగా RCFC సిఫార్సుతో కేంద్ర ఆయుష్ విభాగం ప్రత్యేక ఆహ్వానం మేరకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు.