అసెంబ్లీ స్పీకర్‌కు హరీష్ రావు కీలక లేఖ
TG: అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మాజీ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రెండేళ్లలో అసెంబ్లీ నిర్వాహణలో చోటుచేసుకున్న వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘనలపై బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ ప్రతిష్టను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో జరుగుతున్న పొరపాట్లను ఆ లేఖలో ఎండగట్టారు.