VIDEO: పోలీస్ వాహనంపై రీల్స్.. వీడియో వైరల్
NRPT: ఆకతాయిలు రీల్స్ చేసుకోవడానికి రాష్ట్ర పోలీస్ వాహనాలు అడ్డాగా మారాయి. ఈ మేరకు ఉట్కూరు PS ఆవరణలో రక్షక్ వాహనంపై ఓ వ్యక్తి రీల్స్ చేశాడు. దీనిపై అధికారుల హస్తం ఉందా అనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వీడియో SMలో వైరల్ అవ్వడంతో స్థానికులు, ఉన్నత అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీల్స్ చేసిన వారి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని SI వెంకటేశ్వర్లు తెలిపారు.