షాట్ సర్య్కూట్‌తో టీడీపీ కార్యకర్త మృతి

ATP: కణేకల్లు మండలంలోని సీతారామనగర్ క్యాంపు వద్ద సోమవారం, టీడీపీ కార్యకర్త సురేష్ షాట్ సర్య్కూట్‌తో మరణించాడు. బొమ్మనహళ్ మండలం గోనేహాళ్ గ్రామానికి చెందిన సురేష్, ఎలక్ట్రిషియన్ పనులు చేస్తూ, సోమనాథ్ అనే రైతు పొలంలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్న సురేష్ మృతితో కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.