దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ వ్యాలీ అమరావతిలో..!

దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ వ్యాలీ అమరావతిలో..!

GNTR: దేశంలోనే మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ వ్యాలీని 2026 జనవరి 1న అమరావతిలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తొలి 5 క్వాంటం కంప్యూటర్ హబ్‌లలో అమరావతి ఒకటిగా నిలుస్తుంది. కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, క్వాంటం మెటీరియల్స్ వంటి రంగాలలో విద్యార్థులకు శిక్షణ అందించడం దీని లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా 50 వేల మంది విద్యార్థులకు పైగా శిక్షణ ఇవ్వబోతున్నారు.