VIDEO: గుంతల రహదారితో నిత్యం ప్రమాదాలు
KRNL: చిప్పగిరి మండలం నెమలకల్ గ్రామానికి వెళ్లే 2 కి. మీ రహదారి దుస్థితిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలూరు ప్రధాన రహదారి నుంచి గ్రామంలోకి వచ్చే మార్గం గుంతలమయంతో తరచూ ప్రమాదాలకు నిలయంగా మారిందని వాపోతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రహదారిని బీటీ లేదా సీసీ రోడ్డుని నిర్మించాలన్నారు.