అమరుల త్యాగాల స్ఫూర్తికి నిదర్శనం ఎర్రని స్తూపాలు: సీపీఎం

NLG: ప్రజా సమస్యల పట్ల ఉద్యమాలు పోరాటాలు నిర్వహించి అమరుల త్యాగాల స్ఫూర్తికి నిదర్శనం ఎర్రని స్తూపాలు అని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. ఇవాళ నిడమనూరులో సీపీఎం మాజీ మండల కమిటీ సభ్యులు,సీఐటీయూ జిల్లా నాయకులు గోగుల వెంకన్న 5వ వర్ధంతి సందర్భంగా స్తూపం ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. వెంకన్న సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.