కోడిపందాలు ఆడుతున్న ఏడుగురు వ్యక్తులు అరెస్ట్
E.G: గోకవరం మండలం మల్లవరం గ్రామ శివారునిలో కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు శనివారం సాయంత్రం సమాచారం అందుకున్న ఎస్సై పవన్ కుమార్ తన సిబ్బందితో కోడిపందాల స్థావరానికి చేరుకొని దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఏడుగురు వ్యక్తులును అదుపులోనికి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.