VIDEO: నగదు రివార్డ్ అందజేసిన డీఎస్పీ

ప్రకాశం: కనిగిరిలో గంజాయి నిందితులను అదుపులోకి తీసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు నారాయణ, నూనె నాగేశ్వరరావు, హోంగార్డు మోతుకూరి సీతారాం ప్రసాద్‌లను డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ గురువారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారికి నగదు రివార్డును ప్రోత్సాహకంగా అందజేశారు. అలాగే శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.