ఎస్సీ పేటలో అధ్వానంగా రోడ్లు

ఎస్సీ పేటలో అధ్వానంగా రోడ్లు

E.G: గోకవరం మండలం మల్లవరం ఎస్సీ పేటలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'మొంథా' తుపాను కారణంగా రోడ్లన్నీ జలమయమై, బురదగా మారాయన్నారు. పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మురుగునీరు నిలిచి ఉండడంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.