YCP హయాంలో కల్తీ మద్యం వల్లే కిడ్నీ సమస్యలు: మంత్రి

AP: మంత్రి సత్యకుమార్ వింజమూరులో డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించారు. వైసీపీ హయాంలోని కల్తీ మద్యం సేవించడం వల్లే కిడ్నీ సమస్య బాధితులు పెరిగారన్నారు. తాను రాజకీయ విమర్శలు చేయడం లేదన్నారు. శాస్త్రీయంగా అధ్యయనం జరిగిన తర్వాతే ఈ విషయం చెబుతున్నానన్నారు. కల్తీ మద్యం మూలంగానే అనేక మంది లివర్, నరాల బలహీనతతో ఆసుపత్రులకు వస్తున్నారన్నారు.