కాళేశ్వరాన్ని పునరుద్ధరిస్తాం: ఉత్తమ్
TG: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల పునరుద్ధరణకు శాస్త్రీయ, సాంకేతిక విధానంలో కసరత్తు జరుగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాజకీయ పరంగా, ఇంజనీర్ల స్థాయిలోనూ లోపాలు ఉన్నాయన్న మంత్రి.. ఆనకట్టలను సాంకేతిక విధానంలో సరిచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సీడబ్ల్యూపీఆర్ఎస్ అవసరమైన పరీక్షలు చేస్తోందన్నారు.