రాజన్న హుండీ ఆదాయం రూ. 94,29,209లు

రాజన్న హుండీ ఆదాయం రూ. 94,29,209లు

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానానికి హుండీ ద్వారా రూ. 94,29,209ల ఆదాయం సమకూరింది. గత వారం రోజుల ఆదాయాన్ని బుధవారం లెక్కించగా నగదు రూపంలో రూ. 94,29,209లు, మిశ్రమ బంగారం 67 గ్రాముల 500 మిల్లీగ్రాములు, మిశ్రమ వెండి 4 కిలోలు లభించినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఆలయ సిబ్బంది, వాలంటీర్లు లెక్కింపులో పాల్గొన్నారు.