నేడు యానాదికాలనీలో ఐలమ్మ 40వ వర్ధంతి సభ

నేడు యానాదికాలనీలో ఐలమ్మ 40వ వర్ధంతి సభ

GNTR: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం పోరాడిన చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి సభ నేడు గుంటూరులో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక జనసేవా సంఘం నేడు సాయంత్రం 5 గంటలకు యానాది కాలనీలో స్కూల్ సెంటర్లో ఈ సభని నిర్వహించనున్నట్లు తెలిపారు. రజక నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి రావాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు.