జిల్లాలో కొత్తగా 32 బార్లు

జిల్లాలో కొత్తగా 32 బార్లు

తిరుపతి: జిల్లా వ్యాప్తంగా 32 బార్లను ఏర్పాటు కానున్నాయి. ఇందులో గీత కార్మికుల కోసం 3 రిజర్వు చేయనున్నారు. జనరల్, గీత కార్మికులకు కలిపి తిరుపతిలో 18, శ్రీకాళహస్తి 4, గూడూరులో 4, సుళ్లూరుపేటలో 2, పుత్తూరు -1, చంద్రగిరి-1 (టూరిజం), నాయుడుపేట-1, వెంకటగిరి -1 బార్లతో కలిపి మొత్తం 32 ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.