నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు
MHBD: తొర్రూరు మండల కేంద్రంలో ఇవాళ పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు జనరిక్ మెడికల్ షాపు ప్రారంభించనున్నారు. 10:00 గంటలకు మొక్కజొన్న కొనుగోలు సెంటర్ ప్రారంభోత్సవం, 10:30 గంటలకు వ్యవసాయ యూనిట్ల పంపిణీ, 11:00 గంటలకు కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.