'ప్రమాదంలో అంగన్వాడి పిల్లల ఆరోగ్యం'
SDPT: గజ్వేల్ మండలం కొడకండ్ల అంగన్వాడి కేంద్రంలో డ్రైనేజీ సమస్య వలన పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. అంగన్వాడి కేంద్రం చుట్టూ డ్రైనేజీ పారడం, గోడ పగిలిపోవడం, మిషన్ భగీరథ పైప్‌లైన్ లేకపోవడం వంటి సమస్యలను డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి సోమవారం పరిశీలించి, ప్రభుత్వ అధికారులకు ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన తెలిపారు.